ఒంగోలు అర్బన్: పొగాకు బోర్డు అధికారులు రైతులకు అండగా ఉండాలని కోరుతూ ధర్నా
Ongole Urban, Prakasam | May 19, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు-2 వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను పొగాకు రైతులు అడ్డుకున్నారు. మంగళవారం కంపెనీల వాళ్ళు తాము తెచ్చిన పొగాకు చెక్కులను కొనుగోలు చేయకుండా నో బిడ్ లు పెడుతున్నారాంటూ పొగాకు వేలాన్ని నిలిపివేశారు. ఒంగోలు మండలం కరవది, పానకాల పాలెం గ్రామాలకు చెందిన రైతులు ఈరోజు వేలం కేంద్రానికి పొగాకు చెక్కులు అమ్మకానికి తీసుకువచ్చారు.పొగాకు కంపెనీల వారు 1800 కూడా కొనకుండా నో బిడ్ లు పెట్టడంతో గిట్టుబాటు ధరలపై రైతులు బోర్డు అధికారులు, కంపెనీల వారితో వాగ్వాదానికి దిగారు. గిట్టుబాటు ధరలు కల్పించే వరకు బోర్డు లో కొనుగోలు జరపనివ్వమంటూ ధర్నా చేపట్టారు.