మూడు రోజుల అనంతరం ఆత్మకూరు దోర్నాల ఘాట్ రోడ్లులో వాహనాల రాకపోకలకు అనుమతించిన పోలీసులు
మొంతా తుఫాన్ ప్రభావంతో ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువు అలుగు ఎక్కి రహదారి పై ఉధృతంగా ప్రవహిస్తునడంతో, గత మూడు రోజులుగా మంగళవారం రాత్రి నుంచి ఆత్మకూరు నుంచి విజయవాడ శ్రీశైలం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను ఆత్మకూరు దోర్నాల మధ్య పోలీసులు నిలుపుదల చేశారు, రహదారిపై ఉధృతంగా వాగులు ప్రవహిస్తునడంతో, ఈ ముందస్తు చర్యలు తీసుకున్నారు పోలీసులు, తిరిగి శుక్రవారం ఉదయం నుంచి ఆత్మకూరు దోర్నాల మధ్య ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నట్లు ఆత్మకూరు రూరల్ CI రాము మీడియాకు ప్రకటన ద్వారా తెలియజేశారు,వాగు ఉధృతి తగ్గుముఖం పట్టడంతో రాకపోకలకు అనుమతి ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు,