పట్టణంలోని నెహ్రు నగర్ లో పట్టపగలే చోరీ
Dhone, Nandyal | May 1, 2025 డోన్ పట్టణంలో పట్టపగలే చోరీ జరిగింది. పోలీసుల వివరాలు మేరకు నెహ్రూ నగర్ లో నివాసం ఉంటున్నా నాగరాజు అతని భార్య హాస్పిటల్ కోసం బుధవారం ఇంటికి తాళంవేసి కర్నూలుకు వెళ్లారు. ఇదే అదునుగా దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో కొడుకు పెళ్లి కోసం ఉంచిన 10 తులాల బంగారంతో పాటు రూ. 50వేలు నగదు దోచుకెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చిన నాగరాజు తాళాలు తెరిచి ఉండడం చూసి చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ఇంతియాజ్ భాష తెలిపారు.