నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని నాగమల్లకుంట గ్రామంలో పైపులైన్ పగిలిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పది రోజులుగా పైపులైన్ మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామస్థులు తాగునీటి కోసం పంట పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పగిలిన పైపులైన్ ద్వారా నీరు వృథాగా పోతుండటంతో నీటి ఎద్దడి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.