తుఫాన్ దాటికి నష్టపోయిన  ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం చెల్లిస్తాం: జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ
తుఫాన్ దాటికి నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం అందేలా చూస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ అన్నారు, గురువారం సాయంత్రం బండి ఆత్మకూరు మండలంలోని బండి ఆత్మకూరు, ఏ కోడూరు సంత జుటూరు ప్రాంతాల్లో నష్టపోయిన వరి పంట పొలాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు ,ఈ సందర్భంగా ఆమె వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ, అన్ని మండలాల్లో కూడా పంట నష్టం అంచనాలను రైతుల వారిగా APAIMS అప్లికేషన్లో నమోదు చేయాలని ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం వచ్చేలా చేయాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులకు సూచించారు.