కోయిల్ కొండ: కోయిలకొండ మండల కేంద్రంలో గుట్టపై చిరుత పులి కలకలం
మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం శివారులోని గుట్టపై ఆదివారం చిరుత పులి కలకలం రేపింది. అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి గుట్టలలో ఉన్నా చిరుత పులి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.