డోన్: బేతంచెర్ల లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
Dhone, Nandyal | May 8, 2026 నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణం జండా పేట కాలనీకి చెందిన షేక్షావలి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఉదయం తుదిశ్వాస విడిచారు. కుమారుడి మరణంతో తల్లి రోదనలు మిన్నంటాయి. షేక్షావలి మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.