పటాన్చెరు: ఆధ్యాత్మిక వాతావరణం లో జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు
జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజు మంగళవారం సందర్భంగా అమ్మవారిని గాయత్రి దేవి రూపంలో అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కలిగించారు. ఆలయ ప్రాంగణం భక్తుల నినాదాలతో మారుమ్రోగింది. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా, పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారి ని దర్శించుకుంటున్నారు.