వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించిన బాపట్ల పట్టణ పోలీసులు
బాపట్ల పట్టణంలో మంగళవారం అధిక వేగంతో వాహనాలు నడుపుతూ, సైలెన్సర్లతో శబ్దాలు చేస్తూ, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలతో హల్చల్ చేస్తున్న కొందరు యువకులను మంగళవారం బాపట్ల పట్టణ సీఐ రాంబాబు అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్లకు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలకు సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని యువకులకు సూచించారు.