ఏకలపల్లి వద్ద RTC బస్సు ఢీ – వృద్ధుడికి తీవ్ర గాయాలు
లక్కిరెడ్డిపల్లె–రాయచోటి ప్రధాన రహదారిపై ఏకలపల్లి సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. వేంపల్లి నుండి రాయచోటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వృద్ధుడిని ఎదురుగా వస్తున్న RTC బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.గాయపడిన వృద్ధుడిని స్థానికులు అప్రమత్తమై 108 అంబులెన్స్‌లో లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ప్రమాదాలను నివారించేందుకు డ్రైవింగ్ సమయంలో అప్ర