అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు విడిచే సమయాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది.జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు విద్యా సంస్థల పరిసరాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. విద్యార్థులు బయలుదేరే సమయంలో పాఠశాలలు, కళాశాలల గేట్లు, సమీప ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, పోకిరీల కదలికలను గుర్తించేందుకు డ్రోన్ నిఘాను వినియోగిస్తున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల విక్రయాలు, ఈవ్ టీజింగ్, గొడవలు వంటి ఘటనలు జరగకుండ