నంద్యాల అర్బన్: పసురుపాడులో మద్యం సేవించి విధులకు హాజరైన పంచాయతీ సెక్రటరీ,సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 7, 2026
జిల్లాలో ప్రభుత్వ సేవలు అందజేతను మెరుగుపరచడం కార్యాలయాల్లో క్రమశిక్షణ బలోపితం చేయడం లక్ష్యంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మంగళవారం గోస్పాడు మండలం పసరుపాడు గ్రామ సచివాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో మద్యం సేవించి విధులకు హాజరైన పంచాయితీ సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేశారు.అలాగే స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ ఎంపీడీవో పై చార్జీ మెమో ఫైల్ చేయాలని సూచించారు