ఒంగోలు అర్బన్: కూటమి ప్రభుత్వం జగన్ పై విమర్శలు చేయడమే సరిపోయింది: ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
Ongole Urban, Prakasam | Apr 14, 2026
కూటమి ప్రభుత్వం విమర్శలతో జీవిస్తుందని ఒంగోలు వైసిపి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఒంగోలు పట్టణంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ప్రజలు మరిచిపోయేలా కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తుందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసింది లేదని విమర్శించారు.