ఏటూరునాగారం: ములుగులో దసరా వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు
ములుగులో జరగనున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లను బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.