బనగానపల్లె: ఎస్ ఐ ఆర్ ఫై బనగానపల్లెలో టిడిపి శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లెలోని జీఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్లస్టర్ యూనిట్, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశమై ఓటరు జాబితాల ప్రక్షాళనపై వివరించారు. వలస వెళ్లినవారు, మరణించినవారు, నకిలీ పేర్ల తొలగింపే ఈ కార్య క్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.