డోన్: నంద్యాల జిల్లాలో హైవే ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Dhone, Nandyal | May 29, 2026 ఆళ్లగడ్డ పట్టణ పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం ఆళ్లగడ్డ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ చర్యల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే భూమా కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఈ సమావేశంలో జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ అశోక్ ప్రాజెక్టు మేనేజర్ మదనమోహన్ తదితర అధికారులు హాజరయ్యారు