డోన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ కొరతను అరికట్టడంలో విఫలం : డోన్ సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి శివారం
Dhone, Nandyal | Apr 25, 2026 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ కొరతను అరికట్టడంలో విఫలమయ్యాయని సీఐటీయూ డోన్ మండల ప్రధాన కార్య దర్శి టి.శివరాం విమర్శించారు. జిల్లాలో డీజిల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా, వాహనదారులు క్యూల్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కొరత వల్ల రవాణా రంగం దెబ్బతిని కార్మికుల ఉపాధి ప్రభావితమవుతోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.