ఒంగోలు అర్బన్: రెండవ రోజు కొనసాగిన సంయుక్త కిసాన్ మోర్చా మరియు పొగాకు రైతుల రిలే నిరాహార దీక్ష
Ongole Urban, Prakasam | Jun 25, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట పొగాకు రైతుకు 250 రూపాయల గిట్టుబాటు ధరను కల్పించాలని కోరుతూ రెండవ రోజు గురువారం రిలే నిరాహార దీక్షను నిర్వహించారు దీనిలో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు పొగాకు రైతులు మరియు వామపక్ష నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కిసాన్ మోర్చా నేతలు మాట్లాడుతూ రైతుల నుండి కోట్ల కోట్లు ఆదాయం పొంది ఆస్తులు పెంచుకునేటువంటి కంపెనీలు విదేశీ మార్గద్రవ్యాన్ని అర్జించేటువంటి ప్రభుత్వాలు రైతు పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని కోరారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నినాదంగా కాకుండా నిజరూపంలో కూడా ఉండాలన్నారు వెంటనే వెయ్యి కోట్లను కేటాయించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశా