పుంగనూరు: ఎస్సీ స్మశాన వాటికను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని దళితులు నిరసన.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం తోపు మఠం వద్ద ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన స్మశాన వాటికను కొంతమంది భూస్వాములు ఆక్రమించి ప్రహరి గోడ నిర్మిస్తున్నారని. వెంటనే అధికారులు స్పందించి ఎస్సీ ఎస్టీల స్మశాన వాటికను కాపాడాలని కోరుతూ మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎస్సీ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సంఘాల నాయకుడు రాజా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల స్మశాన వాటికను ఆక్రమించి కట్టడాలు నిర్మిస్తున్న రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని . వెంటనే జిల్లా అధికారులు స్పందించి దళితులకు న్యాయం చేయాలని కోరారు.