డోన్: జనాభా గణనకు సహకరించండి :బేతంచెర్ల తాసిల్దార్ నాగమణి
Dhone, Nandyal | Apr 14, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో ఈనెల 15 నుంచి 30 వరకు నిర్వహించే జనాభా గణనకు ప్రజలు సహకరించాలని తహశీల్దార్ నాగమణి సూచించారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వివరాలు అందజేయాలని కోరారు. సందేహాల నివారణకు 1885 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని ఆమె స్పష్టం చేశారు.