జహంగీర్ పీర్ దర్గాలో ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం కొత్తూరు పోలీసుల ఆధ్వర్యంలో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దర్గాలో ఉన్న సమస్యల పరిష్కారానికి స్థానికులు, గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని, అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని పోలీసులు తెలిపారు.