బనగానపల్లె: నంద్యాల జిల్లాలో 312 మైనర్ డ్రైవింగ్ కేసులు,రూ.15.70 లక్షల జరిమానా
నంద్యాల జిల్లాలో మైనర్ డ్రైవింగ్ను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2026 జనవరి నుంచి మే వరకు 312 మంది మైనర్ డ్రైవర్లను గుర్తించి రూ.15.70 లక్షల జరిమానా విధించారు. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు నంద్యాల ఎస్పీ సునీల్ షౌరాణ్ సోమవారం తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు.