విశాఖపట్నం: అక్టోబర్ 11, 12 తేదీలలో నగరంలో మేకప్ అవార్డ్స్ ఫ్యాషన్ అవార్డ్స్
సిరి మేక్ఓవర్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 11న గ్లో అప్ గాల మరియు అక్టోబర్ 12 న గ్లామ రన్ వే షో జరగనున్నట్లు సౌమ్య తెలిపారు. అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు వీరు మామ పర్యవేక్షణ లో అత్యద్భుతం గా ఈ ఈవెంట్లను రూపొందిస్తున్నామని, అక్టోబర్ 11 న మేకప్ అవార్డ్స్ మరియు ఫాషన్ అవార్డ్స్ మగువలకు అలాగే పిల్లలకు గ్లామర్ రనవే షో చేస్తున్నందుకు చాలా ఆనందం గా ఉందని, ఇప్పటి వరకు విశాఖ లో సుమారు 70 మంది మేక్ అప్ ఆర్టిస్టులను తయారు చేసామని, ఇప్పుడు ఫాషన్ డిజైనింగ్ కోర్స్ కుడా అందరికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని సిరి మేక్ ఓవర్ స్టూడియో ఫాషన్ కు ఒక కొత్త రూపం తీసుకు వొస్తుందని తెలిపారు.