కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక మంచి వేదిక - ప్రకాశం జిల్లా 7వ అదనపు జడ్జి రాజా వెంకటాద్రి
Ongole Urban, Prakasam | Jul 10, 2025
కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక మంచి వేదిక అని ప్రకాశం జిల్లా 7వ అదనపు జడ్జి రాజా వెంకటాద్రి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం పై గురువారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి ఈ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కోర్టు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సివిఎన్ రీడింగ్ రూమ్, మున్సిపల్ ఆఫీస్ మీదగా, చర్చి సెంటర్ వరకు సాగింది. ఈ ర్యాలీలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.