సంతనూతలపాడు: నాగులుప్పలపాడు లో 117 మంది లబ్ధిదారులకు రూ.56.26 లక్షలు విలువ చేసే CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
నాగులుప్పలపాడు మండలంలోని 21 గ్రామాలకు చెందిన 117 మంది లబ్ధిదారులకు మంగళవారం సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ రూ.56.26 లక్షలు విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయాల్లో కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకున్న పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.