ఒంగోలు అర్బన్: పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా నిర్వహించడం లో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | May 27, 2026
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా నిర్వహించడం లో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, పేర్కొన్నారు. బుధవారం ఒంగోలు నగరంలోని ఎస్జివిఎస్ ఫంక్షన్ హల్లో ప్రకాశం, మార్కాపురం, బాపట్ల జిల్లాలకు చెందిన పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు నిర్వహించిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాల అమలు మరియు గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్థాల శుద్ధి కేంద్రాల కార్యాచరణ పై పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు నిర్వహించిన వర్క్‌షాప్లో జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొని ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యం అన్నారు