జహీరాబాద్: పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం, మెగా రక్తదాన శిబిరం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.