కొండపి పొగాకు వేలం కేంద్రంలో జువ్విగుంట క్లస్టర్ కొనుగోళ్లు ముగిశాయి. కొందరు రైతుల దగ్గర పొగాకు నిల్వ ఇంకా కొంతమేరా ఉంది. మొదటి నుంచి వేలం కేంద్రంలో తిరస్కరణ సంఖ్య అధికంగా ఉండడం అపరాధ రుసుముతో వేలం కేంద్రంలో కొనుగోలుకు తీసుకువెళ్లినా తిరస్కరణ తప్పలేదని రైతులు వాపోతున్నారు. కొందరు క్వింటా రూ.1000కి అడుగుతున్నారని రైతులు వాపోయారు.