నంద్యాల అర్బన్: మంత్రి టీజీ భరత్ పై అవినీతి ఆరోపణలు చేసిన వైసిపి రాష్ట్ర యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
Nandyal Urban, Nandyal | May 14, 2026
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి టీజీ భరత్కు మంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేయకుండా వైసీపీ నేతలపై దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆ పార్టీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూలులో నిర్వహించిన 'మహాధర్నా'లో భాగంగా మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేశ్కు తెలియకుండా టీజీ భరత్ ఓ ఫార్మా కంపెనీ నుంచి రూ.45 కోట్లు కొట్టేశాడని ఆరోపించారు.