కావలి: దగదర్తి : తులిమెర్ల గ్రామంలో చల్లా యానాదుల దుర్భర జీవితం...
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు.నేడు అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం. చివరకి చంద్రమండలంపైన సత్తా చాటాం.కానీ దేశంలో అంతర్ఘతంగా కొన్ని జాతులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.వీరికోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఎలాంటి మార్పు రావడంలేదు.ఇలాంటి పరిస్థితి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తులిమెర్ల గ్రామం చల్లా యానాదుల సామాజిక వర్గం చూస్తే అర్ధంకాక మానదు.గ్రామంలో 50 కుటుంబాలు ఉన్నాయి.ఎప్పుడో నాలుగు దశాబ్దాల కిందట నిర్మించుకున్న కాలనీలో నివసిస్తున్నారు.రోడ్లు అంతర్గతంగా ఉన్నాయి.తాగునీటి పథకం అమలులో ఉన్న వారు ర