వేములవాడ: చంద్రఘంట అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు.. ప్రత్యేక పూజలు చేసిన అర్చక స్వాములు
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడవరోజు బుధవారం శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజ కార్యక్రమాలు చేసినట్లు అర్చకులు గోపన్నగారి చందు వెల్లడించారు. నవరాత్రులు అమ్మవారిని పూజించడం ద్వారా సకల శుభాలు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు.