కోడుమూరు: పెంచికలపాడులో ఘనంగా భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలు
గూడూరు మండలంలోని పెంచికలపాడు గ్రామంలో శనివారం భక్త కనకదాసు 538 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కురుబ సోదరులు కనకదాసు చిత్రపటానికి పూలమాలవేసి పూజలు చేశారు. అచంచలమైన భక్తి భావం నింపుకుని తన గానంతో భగవంతుడిని మెప్పించిన కనకదాసు ఆరాధ్యనీయుడని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహించడం ఎంతో గర్వకారణం అన్నారు.