వేములపల్లి: బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లనే బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది: వేములపల్లి పోలీసులు
వేములపల్లి మండలం, బుగ్గబావి గూడెం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం బ్రేకులు ఫెయిల్ అవడం వల్లనే అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లినట్లు ఆదివారం సాయంత్రం వేములపల్లి పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని, కొందరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.