ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని పలు వార్డులలో మురికి కాలువలను శుభ్రం చేయండి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని పలు వార్డులలో పారిశుద్ధ సమస్య ప్రజలను వేధిస్తుంది, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది మురికి కాలువలను సకాలంలో శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారంతో నిండి దుర్గంధం వ్యాప్తిస్తోందని స్థానికులు వాపోతున్నారు, పాత బస్టాండ్ లోని నీళ్ల ట్యాంక్ వద్ద మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో ప్రజలు ముక్కు మూసుకుని రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు