ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శక్తి యాప్ పై మహిళలకు అవగాహన కల్పించిన పోలీసులు, స్మార్ట్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేయించిన పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 16, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు శక్తి యాప్ పై మహిళలకు గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల భద్రత కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ రూపొందించిందని మహిళలు ప్రతి ఒక్కరు తమ స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. అలానే పాఠశాలల్లో విద్యార్థులకు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పట్టణంలోని పాఠశాలలు మరియు బస్టాండ్లలో మహిళలకు అవగాహన కల్పించారు.