అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గుండ్లపల్లి వద్ద అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ఇద్దరినీ బెలుగుప్ప ఎస్ఐ శివ, ట్రైనింగ్ ఎస్సై మహేష్, ఏఎస్ఐ రాందాస్ పోలీసులతో సోమవారం అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరార్ లో ఉన్నట్లు ఎస్ ఐ తెలిపారు. సాయంత్రం స్టేషన్లో ఎస్ఐ తెలిపిన వివరమేరకు దావణగేరి జిల్లాకు చెందిన శివప్ప, అంజన్నలను అరెస్ట్ చేసి 34 గ్రాముల బంగారు, 150 గ్రాముల వెండి, రూ. 1.4 నగదు స్వాధీనం చేసుకున్న మన్నారు. ముఠా సభ్యులు వంశీ, చిదియా, అర్జున్ పరారీలో ఉన్నారన్నారు. గ్రామ శివారులో గుడిసెలు వేసుకుని పగటిపూట గ్రామాల్లో యాచక వృత్తి చేస్తూ తాళం వేసి ఇండ్లల్లో చోరీలకు పాల్పడ్డారు.