కొత్తగూడెం: గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న భద్రాచలం డ్రైవర్ల టీం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఐ ఎఫ్ టి యు నాయకులు
భద్రాచలం డిపో పరిధిలో ఉన్న టీం డ్రైవర్లు 84 మంది గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న ఆ డిపో మేనేజర్ గానీ రీజనల్ మేనేజర్ గాని పట్టించుకోని ఆ సమస్యను పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) రాష్ట్ర నాయకులు నాగేశ్వరావు,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి సతీష్ అన్నారు.గత ఎనిమిది రోజులుగా బస్టాండ్ లో విశ్రాంతి రూములో సమ్మె చేస్తున్న టీం దీక్షను సందర్శించి వారికి సోమవారం సంఘీభావం తెలిపారు..