నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్ బదిలీ
Nandyal Urban, Nandyal | Apr 19, 2026
నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ బదిలీ అయ్యారు. ఆయనను ఏపీ సీఆర్డీఏ విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సాయిప్రసాద్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఆ విభాగ బాధ్యతలను పర్యవేక్షించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.