సంతనూతలపాడు మండలంలోని తొర్రగుడిపాడు క్రిస్టియన్ కాలనీవాసులు ఆదివారం సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్ విజయ్ కుమార్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తొర్రగుడిపాడు లో సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వారు విన్నవించారు. కాలనీలో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈనెల 21న నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరుకావాలని ఎమ్మెల్యేను కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే... తొర్రగుడిపాడు లో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.