నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో బైక్ దొంగలు అరెస్ట్
Nandyal Urban, Nandyal | Jun 12, 2026
నంద్యాల జిల్లా పరిధిలోని బైకుల దొంగతనం కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ జావలి శుక్రవారం తెలిపారు. మహానంది దేవస్థానం పరిధిలో ఇటీవల రెండు బైకుల చోరీకి పాల్పడిన వారిని అరెస్టు చేశామన్నారు. అరెస్టయిన వారిలో నంద్యాలకు చెందిన పాల్తి గోపినాయక్, రాజు, షేక్ సాబీర్ హుస్సేను, గోస్పాడుకు చెందిన దొడ్డగాళ్ల ప్రకాష్ ఉన్నారన్నారు. వారి నుంచి మొత్తం 4 బైకులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.