ఆళ్లగడ్డ: అహోబిలంలో అంగరంగ వైభవంగా రథోత్సవం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి, ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలోని జ్వాల నరసింహ స్వామికి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు, భక్తుల స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు, సాయంత్రం పుష్ప పల్లకి సేవ నిర్వహించారు, ఈ వేడుకల్లో ముద్ర కర్త వేణుగోపాలన్, అడ్మినిస్ట్రేటర్ పార్థసారథి, సౌమ్య నారాయణన్, అర్చకులు పాల్గొన్నారు, భక్తులతో అహోబిలం పుణ్యక్షేత్రం కిక్కిరిసిపోయింది