కథలాపూర్: గ్రూప్-2లో ఉద్యోగం సాధించిన దూలుర్ యువకుడు
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం దూలుర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గ్రూప్-2లో ఉద్యోగం సాధించారు. తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్రెటరీయేట్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చినట్లు చెప్పారు. శ్రీనివాస్ బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం జగిత్యాలలో సేల్స్ టాక్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.శ్రీనివాస్ తండ్రి మేడిపల్లి ఎంఈవోగా పనిచేస్తున్నారు.