నందికోట్కూరు: దళితుల సమస్యలు పరిష్కరించాలని : ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ కు వినతిపత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
నందికొట్కూరు నియోజకవర్గంలో దళితుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ను కోరారు, బుధవారం నందికొట్కూరు పట్టణానికి వచ్చిన ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ను ఎమ్మార్పీఎస్ నాయకులు కలిసి దళితుల భూ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు, అనంతరం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు, ఎస్సీలకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కరించాలని, దళిత కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు, ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి మధు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్