అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని పలు గ్రామాల మీదుగా గత రెండు రోజులుగా ఉదృతంగా ప్రవహిస్తున్న హగిరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని మండల రెవెన్యూ పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో మండల తహసిల్దార్ అనిల్ కుమార్, ఏ ఎస్ ఐ రామదాసు గుండ్లపల్లి వద్ద హగిరి నదిని పరిశీలించారు. హెచ్చరిక బోర్డులను ప్రధాన రహదారులు సందర్శకులు వచ్చు ప్రాంతాల్లో ఏర్పాటు చేయించారు. ప్రధానంగా మండలంలోని నరసాపురం రామనేపల్లి గుండ్లపల్లి శ్రీరంగాపురం బూదివర్తి గ్రామాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.