పలమనేరు: TDPనేత రాస్తా పొరంబోకును కబ్జా చేశాడని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే, YCPకబ్జాలను ప్రశ్నించిన జర్నలిస్ట్ లు
పలమనేరు: పట్టణం గుడియాత్తం రోడ్డు జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న రాస్తా పొరంబోకు స్థలంలో టిడిపి నేత షెడ్డు ఏర్పాటు చేస్తున్నాడని దానిని అడ్డుకోవడానికి వైసిపి నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ ఘటన ప్రాంతానికి చేరుకుని పరిశీలించి మావాళ్లు మీ వాళ్ళు రోడ్లను కబ్జా చేస్తే మిగిలేది ఏమీ ఉండదన్నారు. అధికారులు ఈ ప్రదేశాన్ని ఖాలీ చేయించాలి లేదంటే మేమే ఆ పనికి పూనుకుంటామన్నారు. వైసిపి హయాంలో గడ్డురు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి మూడంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు అలాగే గంటాఊరు ప్రాంతంలో రోడ్లను సైతం సైట్ల కింద అమ్మేశారని జర్నలిస్టులు ప్రశ్నించారు.