గుత్తిలోని అనంతపురం రోడ్డులో హెచ్ పీ గ్యాస్ సిలిండర్ల లారీ క్యాబిన్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. వడియం పేట వద్ద నుంచి హెచ్ పీ గ్యాస్ సిలిండర్లను లోడ్ చేసుకొని బళ్లారి వెళుతుండగా లారీ క్యాబిన్లో మంటల చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై షార్ట్ సర్క్యూట్ అయిన వైర్లను కట్ చేశారు. డ్రైవర్ అప్రమత్తం కాకపోయి ఉంటే పెను ప్రమాదం సంభవించేది.