నందికోట్కూరు: 98 జీవో బాధితుల దీక్ష వంద రోజులు దీక్షలకు సంఘీభావం తెలిపిన వైసిపి ఇన్చార్జి డాక్టర్ ధర సుధీర్ ప్రజా సంఘాల నాయకులు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గత 100 రోజులుగా చేస్తున్న శ్రీశైలం నీటి ముంపు 98 జీవో అమలు చేయాలని నీటిముంపు నిరుద్యోగుల రిలే దీక్షలు శుక్రవారం నాటికి వంద రోజులు అయ్యాయి. నిరుద్యోగులు చేస్తున్న వందరోజుల దీక్షలకు నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ మరియు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.శుక్రవారం వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ సుధీర్, సీపీఎం,సిపిఐ తదితర సంఘాల నాయకులు నాగేశ్వరరావు,రమేష్,పిక్కిలి వెంకటేశ్వర్లు,రఘురాం మూర్తి,నరసింహులు తదితరులు దీక్ష వద్దకు చేరుకుని నిరుద్యోగులకు సంఘీభావం తెలిపారు. తర్వాత దీక్షా శిబిరం వద్ద నుండి పటేల్ సెంటర్ వరకు