నాంపల్లి: మేల్లవాయి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో ఘనంగా రథోత్సవం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
నల్గొండ జిల్లా, నాంపల్లి మండల పరిధిలోని మెల్లవాయి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం మధ్యాహ్నం రథోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నలు, పెద్దలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రథాన్ని కాళ్లతో ఇరువైపులా లాగుతూ ఆనందోత్సాహాలతో ఈ రథోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.