డోన్ పట్టణంలో జరిగిన హత్య కేసులో ఇద్దరికీ యావజ్జీవ శిక్ష
Dhone, Nandyal | May 1, 2025 డోన్ పట్టణంలో జరిగిన హత్య కేసులు ఇద్దరికీ యావజ్జీవ శిక్ష విధించిన న్యాయస్థానం. మండలంలోని ఎస్.గుండాల గ్రామానికి చెందిన బోయ కౌలుట్ల (60) హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గురువారం కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది తీర్పు ఇచ్చారు. పాతకక్షలతో నగేష్, బాలమద్ది 2016లో డోన్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో కౌలుట్ల తలపై బండరాయితో కొట్టి చంపి కాలువలో పడేశారు. కౌలుట్ల కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ఇద్దరు ముద్దాయిలకు యావజ్జీవ శిక్ష విధించారు.