కామారెడ్డి జిల్లాలో శనివారం మోస్తరు వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు కమ్ముకొని ఈదురుగాలులతో కూడిన వాన పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా వర్షం పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా బిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, బిబిపేట్, సదాశివ నగర్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్, పిట్లం, నిజంసాగర్ పలు మండలాల్లో వర్షం కురిసింది. ఒకసారిగా రైతన్నల ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది.